'పిల్లలకు చట్టాలపై అవగాహన పెంచాలి'
జగిత్యాల జిల్లాలోని దరూర్ క్యాంప్ ప్రభుత్వ పాఠశాలలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి పాఠశాల విద్యార్థులకు బాల్య వివాహ చట్టం-2006, పోక్సో చట్టం-2012, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. పిల్లలకు చట్టాలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.