నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని శివాజీనగర్, ఉస్మాన్ నగర్ ప్రాంతాల్లో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించే కార్యక్రమాన్ని మంగళవారం చేపడుతున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ ఏఈ వి. శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.