ఇంటి పన్నులు వసూళ్లపై సమీక్ష
AKP: ఎస్ రాయవరంలో ఇంటి పన్నుల వసూళ్లపై మంగళవారం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. ఈనెల 15వ తేదీలోగా శత శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఇంటి పన్నులు వసూలు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.