వీరవల్లిపాలెం PHCని తనిఖీ చేసిన MPDO
కోనసీమ: అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపీడీవో సరోవర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పనితీరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, సదుపాయాలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిధులను సక్రమంగా వినియోగించి ఆసుపత్రిని అభివృద్ధి చేయాలన్నారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.