చికిత్స పొందుతూ ఉపాధి హామీ కూలి మృతి
MDK: వెల్దుర్తి మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన నాగలక్ష్మి, ఉపాధి హామీ కూలీగా ప్రతిరోజు చేస్తున్న పనులు పూర్తి చేసి ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయింది. వెంటనే స్థానిక వెల్దుర్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.