పెనుకొండలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవితమ్మ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని దేశభక్తి భావంతో వేడుకలను నిర్వహించారు.