కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’
PPM: ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్ వేదిక ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. రెవెన్యూ సమస్యల కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహిస్తారని చెప్పారు. అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని, వాటి స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.