సబ్ డివిజన్ పరిధిలో 6,127 హెక్టర్లలో వరి నాట్లు పూర్తి

సబ్ డివిజన్ పరిధిలో 6,127 హెక్టర్లలో వరి నాట్లు పూర్తి

AKP: అనకాపల్లి వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలో వరి సాధారణ విస్తీర్ణం 6,717 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 6,127 హెక్టార్లలో వరినాట్లు పూర్తయినట్లు ఎండీఏ సుబ్రమణ్యం తెలిపారు. మిగిలిన హెక్టార్లలో ఈ వారంలో నాట్లు పూర్తవుతాయన్నారు. చెరుకు సాధారణ విస్తీర్ణం 2,194 హెక్టార్లు కాగా 1,008 హెక్టార్లలో నాటినట్లు తెలిపారు.