పంట నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు
NGKL: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో ఇటీవల తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఆయా ప్రాంతాలలో నియోజకవర్గ వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పంట నష్టానికి సంబంధించి అంచనాలు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని తెలిపారు.