రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలు నగరంలోని త్రోవగుంట-2 పొగాకు వేలం కేంద్రాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పొగాకు రైతులు సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు సమస్యలు ఎమ్మెల్యేకు వివరించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా బోర్డు అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.