VIDEO: ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో 2కే రన్
NZB: ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 2కే రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఛైర్‌పర్సన్ గోనె లహరి రఘు హాజరై జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు.