VIDEO: వంగదాల్ వాగుకు వరద ఉధృతి

VIDEO: వంగదాల్ వాగుకు వరద ఉధృతి

SRD: సిర్గాపూర్ మండలం వంగదాల్ శివారులోని వాగు పెద్ద ఎత్తున పొంగిపొర్లుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తీవ్రమైంది. దాంతో వంగదాల్ నుంచి గైరాన్ తండాలకు ప్రజల రాకపోకలు నిలిచాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మండలంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.