అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

MDK: మాసాయిపేట మండలం పోతాన్‌పల్లి గ్రామానికి చెందిన తిరుపతి ఆంజనేయులు (49) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై విద్యాచరన్ రెడ్డి తెలిపారు. ఇంటి నిర్మాణానికి అప్పులు కావడంతో 20న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా శుక్రవారం పొలానికి సమీపంలో అడవిలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు.