'నీళ్లు లేక అవస్థలు పడుతున్నాం'

'నీళ్లు లేక అవస్థలు పడుతున్నాం'

KMR: జిల్లా కేంద్రంలోని గొల్లవాడ 5 వార్డులో నీరు రాక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ వాసులు మాట్లాడుతూ.. బోరు మోటార్ నీరు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఈ కాలనీలో దాదాపు 20 రోజుల నుంచి నీరు రాక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.