టీటీడీ ఛైర్మన్ నాయుడు వైఖరికి నిరసనగా ప్రత్యేక పూజలు
కోనసీమ: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యలకు నిరసనగా అమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వైసీపీ అమలాపురం ఇంచార్జి పినిపే శ్రీకాంత్ తెలిపారు. హిందూ ధర్మ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్న నాయుడు వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలు దెబ్బ తిసేలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అతనిని వెంటనే పదవి నుంచి తొలగించాలన్నారు.