సమాజంలో మహిళల పాత్ర కీలకమైంది: MEO
ADB: సమాజంలో మహిళా పాత్ర చాలా కీలకమైందని నేరడిగొండ మండల విద్యాశాఖ అధికారి భూమారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణలో సైతం మహిళలు తమ వంతు పాత్ర పోషిస్తున్నారని MEO కొనియాడారు.