హైనా దాడిలో గేదె మృతి

హైనా దాడిలో గేదె మృతి

జనగామ: రఘునాథపల్లి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో హైనా పశువులపై దాడి చేసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ముసిపట్ల బిక్షపతి అనే రైతుకు చెందిన పశువులపై హైనా మంగళవారం రాత్రి దాడి చేసింది. ఘటనలో ఓ గేదె మృతి చెందింది. గతంలో సైతం హైన దాడిలో తమ పశువులు మృత్యువాత పడ్డాయని గ్రామస్తులు ఆవేదన చెందారు. అటవీ శాఖ అధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.