మైలవరంలో ఒకరి ఆత్మహత్య

NTR: మైలవరంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. దేవుడు చెరువులో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు ఉరేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.