'న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు'
SRPT: కోదాడ ఫుడ్ ప్లాజా వద్ద MRPS కార్యకర్తలను కలిసిన MRPS అధినేత మందకృష్ణ మాదిగ, దళిత యువకుడు కర్ల రాజేష్‌పై జరిగిన చిత్రహింస అత్యంత అమానుషమని అన్నారు. రాజేష్ తల్లి ఫిర్యాదు చేసినా ఇప్పటికి కేసు నమోదు చేయకపోవడంపై ప్రశ్నించారు. ఎస్సై, సీఐలపై కేసు పెట్టి సస్పెండ్ చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని, త్వరలోనే డిజిపిని ,మంత్రి ఉత్తమ్‌ను కలుస్తానని తెలిపారు.