మృతుని కుటుంబానికి బియ్యం అందజేత...!

KNR: హుస్నాబాద్ పట్టణంలో ఇరగదిండ్ల రమేష్ ఇటీవలే మృతి చెందాడు. వారి కుటుంబాన్ని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల వెంకటేష్ పరామర్శించి, వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా వారి వెంట కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షులు బంక చందు, అక్కన్నపేట వడ్డెర సంఘం మండల అధ్యక్షులు ఇరగ దిండ్ల కుమార్, గొల్లెన ప్రశాంత్ కస్తూరి శీను, వున్నారు.