నా సక్సెస్ చూసి అసూయ పడుతున్నారు: రహానే

నా సక్సెస్ చూసి అసూయ పడుతున్నారు: రహానే

IPLలో గత కొంతకాలంగా తన బ్యాటింగ్ శైలిపై వస్తున్న విమర్శలపై KKR కెప్టెన్ రహానే ఘాటుగా స్పందించాడు. '2023 నుంచి IPLలో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాళ్లలో నేను ఒకడిని. నా గురించి తప్పుగా మాట్లాడేవారు బహుశా ఆటను చూడటం లేదేమో. లేదంటే నాపై పగతో మాట్లాడుతుండవచ్చు. నేను ఆడటం వారికి ఇష్టం లేనట్లుంది. నేను సాధించిన విజయాన్ని చూసి వారు అసూయ పడుతున్నారు' అని పేర్కొన్నాడు.