అల్లూరు మండలం పాడి రైతులకు ముఖ్య గమనిక

అల్లూరు మండలం పాడి రైతులకు ముఖ్య గమనిక

NLR: అల్లూరు మండలం పాడి రైతులకు మండల పశు వైద్య అధికారి మహేశ్వరయ్య పలు సూచనలు చేశారు. సబ్సిడీపై పాడి రైతులకు పశువుల మేత ఇవ్వడం జరుగుతుందన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన పాడి రైతులు ఈ పథకానికి అర్హులన్నారు. 50 శాతం సబ్సిడీతో 50 కిలోల పశువుల మేత ధర కేవలం రూ. 555లకు అందిస్తున్నామన్నారు. పశువులు ఉన్న రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.