పెనుగంచిప్రోలు బ్లాకులో పర్యటించిన కేంద్ర ప్రభారీ అధికారి
NTR: పెనుగంచిప్రోలు మండలంలో కేంద్ర ప్రభారీ అధికారి నేలపట్ల అశోక్‌బాబు పర్యటించారు. తొలుత గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్, అందుబాటులో ఉన్న ఔషధాలు, వ్యాక్సినేషన్ గది, ప్రసూతి వైద్య సేవల గది, వ్యాధి నిర్ధారణ కేంద్రం తదితరాలను పరిశీలించారు.