కామారెడ్డిలో ఐదుగురి చిన్నారుల మృతి కలకలం!

కామారెడ్డిలో ఐదుగురి చిన్నారుల మృతి కలకలం!

కామారెడ్డి పట్టణంలో ఐదుగురు చిన్నారుల మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల ముగ్గురు బాలికలను తండ్రి పెద్ద చెరువులో హత్య చేసిన ఘటన మరువకముందే, గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి, విజయ్ ఈనెల 6న కనిపించకుండా పోయి శనివారం రాజానగర్ కాలనీలోని పాడుబడిన బావిలో మృతదేహాలుగా లభ్యమయ్యారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు జారిబావిలోపడి మృతిచెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.