GHMC డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు
హైదరాబాద్‌లో GHMC డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే సుమారు 320 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. కొత్త హద్దుల పటాలు లేకుండా ఫిర్యాదులు అడగడంపై కాంగ్రెస్, BJP, MIM నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు ఆన్‌లైన్‌లో డివిజన్ల హద్దుల సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.