నాణ్యత నిబంధనలు పాటించాలి: కలెక్టర్

WNP: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసే వరి ధాన్యం నిబంధనల ప్రకారం నాణ్యత పాటించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. సోమవారం సాయంత్రం కొత్తకోట, రాజపేట వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. పెడస్టల్ ఫ్యాను, వాడి క్లీనర్ ద్వారా వడ్లను శుభ్రం చేసి కొనుగోలు చేయాలని ధాన్యం కేంద్రం ఇంఛార్జీలను కలెక్టర్ ఆదేశించారు.