అందుకే CMతో కలిసి పనిచేస్తున్నాను: MLA
TG: పనిచేస్తున్న తనపై పదే పదే నిందలు వేస్తే జగిత్యాల అభివృద్ధి ఆగిపోతుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మొదట్లో ఒక్కసారి ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నానని.. కానీ రెండో సారి కేసీఆర్ టికెట్ ఇస్తే ప్రజలు ఆశీర్వదించారని తెలిపారు. పదవిలో ఉన్నంతకాలం అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యం అని చెప్పారు. అందుకే సీఎంతో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు.