VIDEO: జాలర్ల వలకు చిక్కిన మొసలి

VIDEO: జాలర్ల వలకు చిక్కిన మొసలి

కోనసీమ: అయినవిల్లి మండలం అయినవిల్లి లంక గ్రామంలోని నీటిమడుగులలో చేపల వేటకు వెళ్ళిన జాలర్ల వలకు మొసలి చిక్కింది. ఆరు నెలల క్రితం వరదల సమయంలో ఈ ప్రాంతంలోకి మొసలి రావడంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్పట్లో వారు మొసలిని పట్టుకునే ప్రయత్నంలో విఫలమయ్యారు. ఆదివారం స్థానిక జాలర్ల వలకు చిక్కడంతో సమాచారం అందుకున్న అధికారలు సురక్షిత ప్రాంతానికి తరలించారు.