తేతలి వై.జంక్షన్ ఫ్లైఓవర్ పనుల్లో కదలిక
W.G: తణుకు మండలం తేతలి వై.జంక్షన్ వద్ద హైవే ఫ్లైఓవర్ నిర్మాణానికి భూసేకరణ పనులు ప్రారంభమయ్యాయి. గతంలో యజమానులు హైకోర్టును ఆశ్రయించడంతో నిలిచిన ఈ పనులు, కోర్టు తాజా ఉత్తర్వులతో మళ్లీ మొదలయ్యాయని తహశీల్దార్ అశోక్ వర్మ తెలిపారు. యజమానులు హక్కు పత్రాలతో హాజరై సరిహద్దులు చూపాలని కోరారు. ఈ సర్వే పూర్తికాగానే ఫ్లైఓవర్ పనులు వేగవంతం కానున్నాయి.