కుండీలో మొక్క కాదు.. భారీ మర్రి చెట్టు

కుండీలో మొక్క కాదు.. భారీ మర్రి చెట్టు

GNTR: సహజంగా కుండీల్లో మొక్కలు పెరగడం మనం చూస్తుంటాం. కానీ.. పొగగొట్టాన్నే కుండీగా మలుచుకుని పెరిగిన చెట్టును జిల్లాలోని మంగళగిరి మండలం నిడమర్రులో చూడొచ్చు. నలభై ఏళ్ల కిందట ఇక్కడ ఓ సున్నపు బట్టీ ఉండేది. కాల క్రమేపీ ఆ పరిశ్రమ మూతపడినా.. పొగగొట్టం మాత్రం అలానే మిగిలింది. దీంతో అందులో ఓ మర్రి చెట్టు పెరిగి.. భారీ కుండీని తలపిస్తోంది.