VIDEO: ఫొటో దిగుతుండగా మహిళకు గుండెపోటు
TG: ఏ క్షణానికి ఏం జరుగునో ఎవరు ఊహించెదరు అన్న చందంగా ఓ విషాద సంఘటన ఖమ్మంలో జరిగింది. ఖమ్మం జిల్లా గాంధీ చౌక్‌కి చెందిన బొమ్మ సుష్మితా పుట్టకోట ప్రాంతంలో గృహ ప్రవేశానికి వెళ్లింది. అప్పటి వరకు అందర్ని నవ్వుతూ పలకరించిన ఆమె ఫోటో దిగుతున్న సమయంలో గుండె పోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి.. ప్రాణాలు వదిలింది. ఈ అనుకోని ఘటన వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది.