సికింద్రాబాద్ దూరం.. కొత్త జోన్ కోరుతున్న జనం!
HYD: సికింద్రాబాద్ జోన్ పరిధిలోకి బోడుప్పల్, జవహర్‌నగర్, నాగారం, తూంకుంట విలీనమైన విషయం తెలిసిందే. శివారు ప్రాంతాలకు సికింద్రాబాద్ జోన్ కార్యాలయం దగ్గరగా లేకపోవడంతో, ప్రజలకు అవసరమైన సేవలు పొందడం సవాలుగా మారిందన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలీనమైన నాలుగు పుర, నగర పాలక సంస్థల్లో ఏదో ఒకదాన్ని కొత్త జోన్‌గా ప్రకటించాలన్న డిమాండ్లు జోరందుకున్నాయి.