విద్యుత్ తీగకు తగిలిన టిప్పర్, టైర్లు దగ్ధం

విద్యుత్ తీగకు తగిలిన టిప్పర్, టైర్లు దగ్ధం

MHBD: కొత్తగూడ మండలం గాంధీనగర్‌లో శుక్రవారం పెద్ద ప్రమాదం తప్పింది. ఇటుకల లోడుతో వచ్చిన ఒక టిప్పర్ అన్‌లోడ్ చేస్తున్న సమయంలో పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. ఫలితంగా షార్ట్ సర్క్యూట్ జరుగుతూ టిప్పర్ వెనుక టైర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అప్రమత్తంగా ఉన్న డ్రైవర్‌కి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది అని స్థానికులు తెలిపారు.