VIDEO: మామిడి తోటకు నిప్పు

CTR: పుంగనూరు మండలంలోని మల్లుపల్లి గ్రామ సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద మంగళవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నాగరాజు అనే వ్యక్తికి చెందిన మామిడి తోట వద్ద అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందింది. ఫైర్ ఇంజన్ సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలను అదుపు చేసినట్లుగా పేర్కొన్నారు.