రైతుల త్యాగానికి న్యాయం జరిగింది: ఎమ్మెల్యే

రైతుల త్యాగానికి న్యాయం జరిగింది: ఎమ్మెల్యే

PLD: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించడం ఒక మహత్తర చారిత్రాత్మక నిర్ణయం అని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ పట్టణంలో గురువారం పేర్కొన్నారు. ఈ నిర్ణయం కేవలం పరిపాలన పరమైనది మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ముఖ్యంగా రైతుల త్యాగానికి లభించిన గౌరవప్రదమైన గుర్తింపు అని ఆయన స్పష్టం చేశారు.