నిజాంసాగర్ పాజెక్ట్ సాగునీరు విడుదల..!

నిజాంసాగర్ పాజెక్ట్ సాగునీరు విడుదల..!

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలపై అధికారులు కీలకవ్యాఖ్యలు చేశారు. ప్రధాన కాలువ ద్వారా 5వ విడతలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3:00 గంటలకు 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలువల పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు.