'ఇంటింటికి వెళ్లి సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజలకు తెలపాలి'

VZM : ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమంతో పాటు చేయబోయే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. మంగళవారం గజపతినగరంలోని టీడీపీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పై సమావేశం జరిగింది. క్లస్టర్ బూత్ ఇన్‌ఛార్జులు ప్రజలకు తప్పనిసరిగా వివరించాలని కోరారు.