సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
NLR: జిల్లాలోని ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డా. అజిత వేజెండ్ల స్పష్టం చేశారు. గురువారం ఉదయగిరి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 18 అర్జీలు వచ్చినట్లు ఆమె తెలిపారు. రెవెన్యూ సమస్యల అంశాలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.