ధాన్యాన్ని అమ్మేందుకు టోకెన్లు జారీ

ధాన్యాన్ని అమ్మేందుకు టోకెన్లు జారీ

MNCL: రైతులు ధాన్యాన్ని అమ్మేందుకు టోకెన్లను జారీ చేస్తున్నామని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ క్లస్టర్ ఏఈవో సంధ్య సూచించారు. శుక్రవారం జన్నారంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా రైతులకు ఆమె టోకెన్లను జారీ చేశారు. ధాన్యాన్ని అమ్మాలంటే వ్యవసాయ శాఖ ద్వారా టోకెన్లను జారీ చేస్తున్నామని వివరించారు.