రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

NDL: ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లమల ఘాట్ రోడ్డులో ఐచర్ వాహనం ఇవాళ ప్రమాదానికి గురైంది. గుంటూరు నుంచి బియ్యం లోడుతో ఎమ్మిగనూరుకు వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండను ఢీకొట్టింది. ఘటనలో యాకోబు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని ట్రాఫిక్ సవ్యంగా నడిచేలా చర్యలు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.