జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

కామారెడ్డి: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ అశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును పరిశీలించారు. ఆసుపత్రిలోని వసతుల గురించి సూపరిండెంట్ రాంసింగ్‌ను అడిగి తెలుసుకున్నారు. రోగులకు సరైన వైద్యాన్ని అందించాలన్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులతో ఎక్కువగా రోగులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.