VIDEO: 'జీతాలు వెంటనే విడుదల చేయాలి'
NRML: గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని, కార్మికుల ఎన్నికల విధుల డబ్బులు చెల్లించాలని IFTU ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు కడెం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం డీటీ లచ్చిరాంకు వినతి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజేష్ మాట్లాడుతూ.. వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు.