'ప్రత్యేక తనిఖీలు.. రూ.50 వేలకు మించి నగదు వద్దు'
NZB: ఏర్గట్ల మండలంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పర్యవేక్షణ బృందం సభ్యులు లక్ష్మీనారాయణ, అరవింద్ రెడ్డి తెలిపారు. వాహనదారులు తమ వెంట రూ.50 వేలకుమించి నగదు ఉంచుకోవద్దని బుధవారం సూచించారు. అక్రమంగా మద్యం, డబ్బు, విలువైన వస్తువుల తరలింపును అరికట్టేందుకు మండలంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.