ఘట్టమ్మ దేవతను దర్శించుకున్న ఎమ్మెల్సీ

ఘట్టమ్మ దేవతను దర్శించుకున్న ఎమ్మెల్సీ

ములుగు జిల్లా పట్టణంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆదివారం ఘట్టమ్మ దేవతను ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దేవత ఆశీస్సులు పొందారు. అనంతరం మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతల దర్శనానికి తరలివెళ్లారు. వనదేవతల ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ కోదండరాం ఆకాంక్షించారు.