VIDEO:శోభయమానంగా మహదేవుడి శోభాయాత్ర
SRD: కంగ్టి మండలం గాజులపాడు గ్రామంలో మహాదేవుని జాతర ఉత్సవాల్లో మంగళవారం ఉదయం మహదేవుని శోభయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పురవీధుల్లో మహదేవుడిని శోభాయమానంగా ఊరిగించారు. ఈ సందర్భంగా గ్రామ అరాధ్య దేవుడిని ప్రతి ఇంటి ఎదుట భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ శోభాయాత్రలో వీరభద్ర దండకం పద్యాలు, గేయాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు.