తప్పిపోయిన బాలుడిని తండ్రికి అప్పజెప్పిన పోలీసులు

ప్రకాశం: పెద్దారవీడు మండలం గుండం చర్ల గ్రామానికి చెందిన గోరంట్ల శివరామ క్రిష్ణ రెడ్డి(8) తండ్రి రాజేశ్వరరావు రెడ్డితో కలిసి సోమవారం మార్కాపురం పట్టణానికి వచ్చారు. స్థానిక వినోద్ హాస్పటల్ వద్ద బాలుడు తప్పిపోయాడు. దీంతో బాలుడు తప్పిపోయాడని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక ఎస్సై సైదు బాబు తన సిబ్బందితో కలిసి బాలుడిని కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు.