గేదె మృతి.. వేదనలో పాడి రైతు

గేదె మృతి.. వేదనలో పాడి రైతు

SRCL: పిడుగు పాటుతో గేదె మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి (మం) సారంపల్లి గ్రామంలో రాముల లింగయ్యకు చెందిన బర్రె పిడుగు పాటుకు పడి మృత్యువాత పడింది. రైతుకు లక్ష రూపాయల నష్టం జరిగినట్లు స్థానిక రైతులు తెలిపారు. పాడి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.