VIDEO: బ్రిడ్జి నిర్మించాలంటూ గ్రామస్తులు ఆందోళన

VIDEO: బ్రిడ్జి నిర్మించాలంటూ గ్రామస్తులు ఆందోళన

MDK: జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మించాలంటూ నార్సింగ్ మండలం వల్లూరులో గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేపట్టారు. వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడం, రాత్రి సమయాల్లో మార్గం దృష్టికి అందకపోవడం వంటి కారణాలతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వారు వాపోయారు. ప్రస్తుతం ఉన్న మలుపు దగ్గర వాహనాలు కనిపించకపోవడం వల్ల పలుమార్లు ప్రాణ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.