కారంచేడులో పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం
BPT: సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడంతో కారంచేడు మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. కారంచేడు, ఆదిపూడి తదితర గ్రామాలకు రామ్మోహన్ రావు, కేవీపాలెం పరిధికి అనిత, దగ్గుబాడు ప్రాంతానికి నేతాజీ, మరికొన్ని గ్రామాలకు నాగరాజు, జ్యోత్స్నలకు బాధ్యతలు అప్పగించారు.