వీర నారి చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన కలెక్టర్

SRCL: వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నివాళులర్పించారు. బుధవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేశారు. ఘనంగా నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలని కొనియాడారు.